రోడ్డు ప్రమాద కుటుంబాలకు ఆర్థిక సహాయం ..

Financial assistance to road accident families..నవతెలంగాణ – ధర్మారం 
మండలంలోనిబంజరపల్లి లంబడి తండాvవాసులు సంతోష్ నాయక్ రాజశేఖర్ నాయక్ ఇరువురు గత నెల 27న రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా నిరుపేద వారైన వారి చిన్న పిల్లలకు అండగా బంజరుపల్లి తండా ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.30 వేల ఆర్థిక సహాయం మానవతా దృక్పథంతో అందజేశారు. ఈ సందర్భంగా మృతుడు రాజశేఖర్ నాయక్ కుమార్తె మహాన్వితకు పదివేల రూపాయలు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేసి తల్లి సునీతకు పాసుబుక్ అందజేశారు. సంతోష్ నాయక్ కుమారుడు శ్రీహాన్ తల్లి ప్రత్యూషకు రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బంజరుపల్లి తండా ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు మోతిలాల్ నాయక్ ఉపాధ్యక్షులు రాజుu నాయక్ కార్యదర్శి రతన్ నాయక్ కోశాధికారి శ్రీనివాస్ రాజు నాయక్ రమేష్ నాయక్ స్వామి నాయక్ శంకర్ నాయక్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.