
చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన జల్ల సూర్యనారాయణకు ఆర్థిక సాయం చేశారు. సోమవారం రాజీవ్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో జల్ల సూర్యనారాయణకు రూ.15వేల నగదు ఆర్థిక సాయం రాజీవ్ స్మారక ట్రస్ట్ కార్యదర్శి ఎంఏ ఖయ్యూం అందజేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న జల్ల సూర్యనారాయణ విషయం తెలుసుకొని ఆర్థిక సాయం చేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏఆపదలో ఉన్న కార్యకర్తలను రాజీవ్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదుకుంటామని ఎంఏ ఖయ్యూం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వైస్ చైర్మన్ ఉప్పు భద్రయ్య పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్ మాజీ ఉపసర్పంచ్ గంగాపురం గంగాధర్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు చేవెళ్లి శివకృష్ణ దేవాలయ కమిటీ చైర్మన్ కుర్నాల వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎర్ర విక్రమ్ గౌడ్ యూత్ అధ్యక్షులు ఢిల్లీ నాగరాజు రెడ్డి సీనియర్ నాయకులు కందగట్ల చరణ్,తుడిమిల్ల సత్యనారాయణ,దేవరకొండ శ్రీకాంత్,చొప్పరి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.