కార్యకర్తలను కార్యకర్త కుటుంబాలకు కష్టసుఖాలలో ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య, మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్ అన్నారు. బుధవారం రాయపోల్ మండలం గొల్లపల్లి గ్రామంలోకాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ నాయనమ్మ మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ నాయనమ్మ అకాల మరణం తెలుసుకొని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు అంత్యక్రియల ఖర్చు కోసం రూ.5 వేలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి కృష్ట గౌడ్, మండల నాయకులు కిష్టారెడ్డి, టెంకంపేట స్వామి గౌడ్, వార్డ్ మెంబర్స్, రాజమల్లు కనకయ్య, పాపొల్ల మల్లయ్య,పెద్దకుర్మ స్వామి,బుచ్చిమల్లు కిష్టయ్య,ఎల్లమ్మోళ్ల మల్లయ్య, పెద్దగొల్ల యాదగిరి, అయిలాపురం మహేష్ యాదవ్, బండి రాకేష్ యాదవ్ స్వామి యాదవ్, గోల్లెంకి దుర్గయ్య యాదవ్,తదితరులు పాల్గొన్నారు.