బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – రామారెడ్డి
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని మాజీ సర్పంచ్ కందూరి బాలమణి లింబాద్రి ఆధ్వర్యంలో సోమవారం అందజేశారు. మండలంలోని ఇస్సన్నపల్లి గ్రామానికి చెందిన దొంతుల నరేష్ గత నాలుగు రోజుల క్రితం మరణించగా, బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కల్వకుంట్ల మదన్ మోహన్ రావు గారి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.3000, 25 కేజీల బియ్యం అందజేశారు. మదన్ మోహన్ రావు గారితో చరవాణిలో మాట్లాడిపించి, అన్ని రకాలుగా ఆదుకుంటామని, ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బంటు రాజేందర్, దోమకొండ బైరయ్య యాదవ్, కొర్రి శంకర్, రెడ్డిపేట బాలయ్య, తుమ్మల రమేష్, ఎడ్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.