
మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన బొమ్మిడి రఘుపతి రెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి విద్యుత్ షాక్ సర్క్యూట్ తో మొబైల్, బట్టలు, బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు కాలిపోవడంతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ విషయం తెలుసుకొని మంగళవారం బాధిత కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయంతో పాటు బట్టలను బాధిత కుటుంబానికి అందజేశారు. దాదాపు రూ.150000 ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెండ్యాల నరసారెడ్డి, బండి ప్రవీణ్, తదితరు లు ఉన్నారు.