నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని చౌదర్‌పల్లి గ్రామంలోని వడ్డేమార్ల ప్రభు గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య తమవంతుగా మృతుని కుటుం బానికి రూ. 2వేలు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ ఏమి రెడ్డి భగవాన్‌రెడ్డి 3వేలు అందజేశారు. తలకొండపల్లి జడ్పీటీసీ, ఉప్పల వెంకటేష్ తన ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా యువ నాయకుడు ఏమ్ రామస్వామితో రూ.3వేలు అందజేశారు. జైశ్రీరామ్ సేవా సమితి సభ్యులు బాధిత కుటుంబాన్ని ఓదార్చి, రూ.2 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం గ్రామపెద్దలు మాట్లాడుతూ అతి చిన్న వయసులో మృతి చెందడం బాధకరమన్నారు. ప్రభు మృతితో గ్రామస్తులు, స్నేహితులు కన్నీటిపర్యాంతమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ కాలె శేఖర్, జై శ్రీరామ్ సేవా సమితి సభ్యులు వడ్లం సత్యంచారి, తేజ సీడ్స్ డి. మల్లయ్య, స్కూల్ వైస్ చైర్మన్ మల్లయ్య, భద్రాచలం, కాంగ్రెస్ యువ నాయకుడు రవికిరణ్ రెడ్డి, మల్లేష్, నరేందర్ రెడ్డి, శ్రీశైలం, రాములు, రాఘవేందర్, ప్రసాద్, విజరు, డి.స్వామి, మార్ల శేఖర్, గణేష్, సిహెచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.