మండలంలోని నాగారం కు చెందిన మంగ వినయ్ అనారోగ్యంతో మృతి చెందడంతో అతనితో చదువుకున్న మిత్రులు వారి కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. మండలంలోని అరూర్ కు చెందిన పురుమ కృష్ణ అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబానికి స్థానిక మాజీ జెడ్పిటిసి సౌజన్యంతో వారి కుటుంబానికి 10 వేల రూపాయలు, అదే గ్రామానికి చెందిన బిజెపి జిల్లా నాయకులు సి ఎన్ రెడ్డి 5 వేల రూపాయల ఆర్ధిక సాయం ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకిటి శరత్, పవన్ రెడ్డి, బుర్ర నర్సింహా, సుక్క ముత్యాలు, కరుణాకర్, గొల్ల నవీన్, దుబ్బ శ్రీకాంత్, భాస్కర్, రాజు, సలీం, విక్రమ్,యాదయ్య, పజిల్, బిక్షపతి, కృష్ణ యాదవ్ తదిరులు పాల్గొన్నారు.