నవతెలంగాణ-రంగారెడ్డిడెస్క్
మండల పరిధిలోని శుక్రవారం పడకల్ గ్రామంలో శ్రీరాములు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ మండలాధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి రూ.3వేలు, ఉమ్మడి పడకల్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ పడకల్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు జల్లెల శ్రీశైలం యాదవ్ రూ.2500లు మతుడు శ్రీరాములు భార్యకు అలివేలకు స్థానిక ఎంపీటీసీ మండల ఫోరమ్ అధ్యక్షులు జోగు రమేష్ ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ గ్రామ నాయకులు తిరుపతిగౌడ్, రామచంద్రయ్య, నరసింహ, శ్రీశైలం యాదవ్, మహేష్, శ్రీశైలం, నరసింహ, విజరు కుమార్, నరేష్, రవి, కళ్యాణ్, గౌస్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వెల్జాల్ గ్రామంలో మాజీ సర్పంచ్ వాడ్యాల జంగయ్య కూతురు యశోద అనారోగ్యంతో రాత్రి చనిపోవడం జరిగింది. ఈ విషయం కాంగ్రెస్ గ్రామ నాయకుల ద్వారా తెలుసుకున్నా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్‌రెడ్డి మతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దాహాన సంస్కారాల కోసం రూ.3 వేలు ఆర్థిక సహాయన్ని కాంగ్రెస్ గ్రామ పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ అజీజ్, రాజు, విష్ణు, జంగయ్య, మైసయ్య, బాల్ చెన్నయ్య, నరసింహ, జంగయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.