అనారోగ్యంతో మృతి చెందిన బాలయ్య కుటుంబాన్నికి ఆర్థిక సాయం

– అనారోగ్యంతో మృతి చెందిన బాలయ్య కుటుంబాన్నికి ఆర్థిక సాయం అందించిన ఉపసర్పంచ్ పరశురాములు
నవతెలంగాణ- మిరు దొడ్డి 

ఇటీవల అనారోగ్య కారణంగా మరణించిన  ఇదారి బాలయ్య  కుటుంబాన్ని గ్రామ ఉపసర్పంచ్ గురుక పరశురాములు వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం.  మృతి చెందిన కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు తనవంతు చేయూత ను అందించారు. ఈ కార్యక్రమంలో బోయిని రామస్వామి, తంగళ్ళపల్లి బైరవ చారి, వాసూరీ రాములు, దీపంపల్లి  కనకయ్య, ఊస మురళి స్వామి, పాలమాకుల అరుణ్ కుమార్, రెడ్డిపల్లి శ్రీకాంత్ రెడ్డి, దీపంపల్లి నాగరాజ్, సిద్ధిరాములు గౌడ్, బిఆర్, వాసూరి నవీన్, కానుగంటి భానుచందర్, ఈదారి ప్రవీణ్, చాకలి శ్రీకాంత్, కుమ్మరి నరసింహులు,కుమ్మరి స్వామి, చాట్లపల్లి అజయ్, చిట్కుల పరశురాములు, భోయిని మహేష్, చాకలి స్వామి , కంచం భాను, ఈదారి నాగరాజు, తోడేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.