మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం

నవతెలంగాణ- వలిగొండ రూరల్ : మండలంలోని పహిల్వాన్ పురం కు చెందిన గ్రామపంచాయతీ సిబ్బంది  వట్టిపెళ్లి నర్సింహా(మున్షి) అనారోగ్యంతో మృతిచెందడంతో వారికుటుంబానికి ఆ గ్రామ సర్పంచ్ తుమ్మల వెంకట్ రెడ్డి సౌజన్యంతో బుధవారం 10 వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.