మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని అరూర్ కు చెందిన వడ్రబోయిన గౌతమ్ శుక్రవారం ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వాకిటి అనంత రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 4 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిట్టల సుధాకర్, బుర్ర శ్రీకర్, శివ, వేల్పుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు