
డిండి మండల కేంద్రంలో ఆదివారం సింగ జోగి ముత్తమ్మ మరణించడంతో ఆమె కుటుంబానికి డిండి మండల కేంద్రంలోని యువత చేయూత ఆర్గనైజేషన్ వారు రూ.10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… డిండి యువత చేయూత అనే నినాదం తో డిండి గ్రామంలో ఎవరు మరణించిన కుల మత బేధం లేకుండా ప్రతి ఒక్కరికి ఎదో ఒక విదంగా సహకరించాలన్న దృఢ సంకల్పం తో ఈ 21 మంది సభ్యులతో ఈ గ్రూప్ ఏర్పడటం జరిగిందన్నారు. అందులో భాగంగా సింగజోగి ముత్తమ్మ మరణించటం తో రూ.10000 /- రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందచేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పున్న దినేష్, బాదమోని శ్రీనివాస్ గౌడ్, నూకం వెంకటేష్, అబ్దుల్ ఖయ్యుమ్, పులిజాల రమేష్, బోల్లే శైలెష్, పోలం లక్ష్మణ్, పోషాలు, చెన్నయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.