వేములవాడ రూరల్ మండలములోని ఎదురుగట్ల గ్రామానికి చెందిన పొన్నం పరశురాం గౌడ్ ఈ మధ్యనే తాటి చెట్టు పైనుండి పడి మృతి చెందడంతో అతని కుటుంబానికి సోమవారం రాష్ట్ర గౌడ యూనిఫామ్ అసోసియేషన్ , రాజన్న సిరిసిల్ల జిల్లా గోపా ఆధ్వర్యంలో రూ 70000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చనిపోయిన గీత కార్మికునికి ప్రభుత్వం వెంటనే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.40 సంవత్సరాలు నిండిన గీతా కార్మికునికి పెన్షన్ ఈవ్వలని డిమాండ్ చేశారు. ఆయనకు నలుగురు కుమార్తెలు ఉండగా చిన్న కుమార్తె విద్యాభ్యాసం కోసం తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ యూనిఫామ్ అసోసియేషన్ సభ్యులు సిఐ రాజమౌళి గౌడ్, రిటైర్డ్ సిఐ బుచ్చిరాములు గౌడ్, నాగన్న గౌడ్, గోపా జిల్లా అధ్యక్షులు కంచర్ల అమరేందర్ గౌడ్, వేములవాడ గోప పట్టణ అధ్యక్షులు దూలం సంపత్ గౌడ్ ,కార్యదర్శులు వికృతి లక్ష్మనారాయణ గౌడ్, కైరీ లింగయ్య గౌడ్, ఎదురుగట్ల గౌడ సంఘం నాయకులు పాల్గోన్నారు.