మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – తొగుట
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించామని మండల కో- అప్షన్ సభ్యులు  ఎండి కలీ మోద్దీన్ తెలిపారు. శనివారం తొగుట గ్రామానికి చెందిన కాసర్ల మైసవ్వ వయసు మే 1వ తేదీన మతిస్థిమితం లేక కూడవెల్లి వాగులో పడి  మృతి చెందింది. విషయాన్ని తొగుట గ్రామస్తులు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్ రామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆయన మృతురాలు కుటుంబానికి రూ. 5 వేలు పంపించి నట్లు కో అప్షన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్ర మంలో మాజీ సర్పంచ్ పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, దాసు, అరుణ్, కాసర్ల పోచయ్య, శివరామణి నవీ న్, ఎర్రోళ్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.