మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం

నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన బొడ్డే జంగమ్మ అనారోగ్యంతో మతిచెందింది. గురువారం ఈ విషయం తెలుసుకున్న తలకొండపల్లి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి. చంద్రశేఖర్‌ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 3 వేలు ఆర్థికసాయం అందజేవారు. 5రోజుల క్రితం మతిచెందిన ఆలూరి పుళ్ళమ్మ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 3 వేలు అందజేశారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రేణు రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 3 వేలు అందజేవారు. కార్యక్రమములో బీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు ఎదుల రాజు, అనంత రాములు, ప్రశాంత్‌ రెడ్డి, గురువయ్య , కాణుగుల మల్లేశ్‌, కోల అశోక్‌, జోలం విజేందర్‌, బొంబాయి రాజు, మహేష్‌, వెంకటయ్య, దామోదర్‌ , రాజశేఖర్‌, రమేష్‌, రాములు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.