నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లంజపెళ్లి నరసయ్య తల్లి లంజపెల్లి వెంకటలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. గురువారం దశదినకర్మకు టీఎస్ యుటిఎఫ్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఈసం బుచ్చయ్య సందర్శించి వారి చిత్రపటానికి పూలబాలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం వారి కుటుంబానికి రూ. 3 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. కాటాపూర్ మాజీ సర్పంచ్ లంజపెల్లి నరసయ్య తల్లి మృతి చెందడం, మన మధ్యలో లేకపోవడం బాధాకరం అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పులి రవి గౌడ్, తమ్మల సమ్మయ్య గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండారు చంద్రయ్య, దళిత సంఘం నాయకులు కోకిల సారయ్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.