మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

Financial assistance to the family of the deceasedనవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని రామన్నగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన గంధపాక ఉప్పలయ్య కుటుంబానికి రూ. 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ కాసు విజయమ్మ కుమారుడు యువ నాయకుడు కాసం రంజిత్ రెడ్డి తెలిపాడు. గురువారం గ్రామపంచాయతీ సిబ్బంది బొల్లం ఎల్లయ్యను మృతి చదిన కుటుంబానికి పంపించి ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరుకుంటున్నాను ఆయన మృతి గ్రామానికి తీరనిలోటు అని అన్నారు. అందరితో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. అందుకోసం ఆయనను ఆదుకునేందుకు ధనవంతుగా కృషి చేయాలని ఉద్దేశంతో గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న బొల్లం ఎల్లయ్య కు రంజిత్ రెడ్డి ఫోన్ చేసినీకు ఫోన్ పే ద్వారా డబ్బులు రూ.5000 రూపాయలను పంపిస్తున్నాను అవి విడిపించి మృతిచెందిన గంధపాక ఉప్పలయ్య కుటుంబానికి  అందించమని తెలిపాడు. రంజిత్ రెడ్డి మన గ్రామంలో మృతి చెందిన వారిని ఆదుకునేందుకు నా వంతు సహాయం చేశారని తెలిపారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక కృషి చేయడం తెలిపారు. దీంతో గ్రామస్తులు హర్ష వ్యక్తం ప్రకటించారు.