
మండలంలోని నంది మేడారం గ్రామానికి చెందిన నిరుపేద చేనేత కార్మికుడు గోనె మల్లేశం ఆర్థిక ఇబ్బందులతో మనస్తావం చెంది గతవారం క్రితం ఆత్మహత్య చేసుకోగా మంగళవారం రోజు ధర్మారం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తలమక్కి రవీందర్ శెట్టి ఆధ్వర్యంలో నిరుపేద మృతుడు గోనె మల్లేశం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి తక్షణ సహాయంగా 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు, రూ.7700 రూపాయలు ఆర్థిక సహాయం లైన్స్ క్లబ్ సభ్యులు చందాలు వేసుకుని సాయం చేశారు సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు నిరుపేదలమైన తమను ఆర్థికంగా ఆదుకున్నందుకు లైన్స్ క్లబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ డాక్టర్ కామణి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ 1 ఇప్ప మల్లేశం,సెక్రెటరీ అబ్దుల్ ముజాహిద్, ట్రెజరర్ కట్ట రమేష్, ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పుచ్చకాయల మునీందర్ రెడ్డి,సభ్యులు విట్ట రవి, చంద్రకాంత్ రెడ్డి, అక్కనపల్లి చంద్రయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.