నవతెలంగాణ-తిరుమలగిరి : తిరుమలగిరి మున్సిపాలిటీ 13 వార్డ్ అంబేద్కర్ నగర్ కు చెందిన బోడ. యాదగిరి అనారోగ్యం తో గురువారం ఉదయం మరణించారు. ఈ మేరకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలగిరి మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కందుకూరి బాబు వారి పార్ధవాదేహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి 5,000/- రూ.ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో,నరేష్ ,శ్రవణ్ పవన్ నరేష్తదితరులు పాల్గొన్నారు.