
– యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు శ్రీనివాస్
నవతెలంగాణ – నెల్లికుదుర్
మృతుడు పిట్టల వెంకన్న కుటుంబానికి రూ.6,500 ఆర్థిక సహాయాన్ని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందించినట్లు యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు చెన్నబోయిన శ్రీనివాస్ పెరుమాండ్ల కిరణ్ తెలిపాడు. మండలంలోని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన వెంకన్న కుటుంబాన్ని సందర్శించి తనమార్సించి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిట్టల వెంకన్న మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ నాయకులు,పొట్టకార్ల యాకన్నా,సింగారపు రంగన్న, తెప్ప శ్రీకాంత్, అక్కెర. బన్ను,యాకన్నా, రమేష్ తదితరులు పాలుగోన్నారు.