నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట్ గ్రామానికి చెందిన చందా లక్ష్మీనారాయణ ఇటీవల పంట పొలానికి పురుగుల మందు పిచికారి చేసి, అస్వస్థకు గురై మృతి చెందగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ధనుసరి సూర్య, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శనివారం సందర్శించి, పరామర్శించి ఓదార్చారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం దశదినకర్మకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందా లక్ష్మీనారాయణ చాలా మంచివారని వారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డ్ ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ అర్రేం లచ్చు పటేల్, తాడ్వాయి తాజా మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సుమన్ రెడ్డి, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చేర్ప రవీందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్, చర్ప స్వామి, కీసరి శ్రీను, సంధి రాజశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.