ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన మంతెన సందీప్ ఇటీవల మనస్థాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా మంగళవారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సందర్శించి, పరామర్శించి ఓదార్చారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, బీరెల్లి మాజీ సర్పంచ్ జాజ చంద్రం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి మృతుని దశదినకర్మకు రూ.10,000 రూపాయల నగదు, బియ్యం నిత్యవసర సరుకులు, ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంతెన సందీప్ కుటుంబానికి భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మంతెన సందీప్ చాలా మంచి యువకుడని ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు నూశెట్టి రమేష్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సాయిరి లక్ష్మీనరసయ్య, గడదాసు దేవయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు దాయ రోశయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జి బందెల తిరుపతి, నాయకులు బాగే రాములు, మోరే నర్సింగరావు అన్నల కిషోర్, కాలేశ్వరం నర్సింగరావు, బిఆర్ఎస్ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు నూశెట్టి రాము, కిషోర్, మధు బాబు, నాగమణి,దామమెరవాయి మాజీ సర్పంచ్ సరిత రమేశ్, బిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.