ఎమ్మెల్యే చొరవతో వరద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం 

Financial assistance to the flood affected family on the initiative of MLAనవతెలంగాణ – మద్నూర్ 
జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని కొడిచీర గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొండి వాగులో కొట్టుకుపోయి మరణించడం జరిగింది. విషయం జుక్కల్ ఎమ్మెల్యే తో లక్ష్మీ కాంతారావు  దృష్టికి తీసుకురాగా.ఎమ్మెల్యే  వెంటనే స్పందించి స్థానిక మండల ఎమ్మార్వో, ఎస్సైలతో మాట్లాడి వివరాలు సేకరించి పై అధికారులకు నివేదికలను పంపించారు.ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేసిన సందర్బంగా. మంగళవారం నాడు సురేష్ భార్య పోచవ్వకు డిప్యూటీ కలెక్టర్ 5 లక్షల రూపాయల చెక్కును అందించారు.