కొళాటం టీంకు ఆర్థిక సహాయం

– మహిళలకు అండగా బుసిరెడ్డి పౌండేషన్
– మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అకాంక్ష..
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, నిడమానూరు మండలం, వడ్డెర గూడెం గ్రామంలోని మహిళలు నేర్చుకుంటున్నారు.వాళ్ళు అడగ్గానే   బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి మంగళవారం  పదివేల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్బంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కోలాటం నేర్చుకొని మహిళలు ఇలా ఆడుతుంటే చాలా ఆనందంగా వుందని అన్నారు.ఈ రోజుల్లో కూడా ఎంతో ధృడ నిశ్చయంతో మీరు నేర్చుకుంటూ మీతోటి వారిని ఎంకరేజ్ చేస్తూ వారిని ముందుకు తీసుకుపోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం.రానున్న కాలంలో నేను మీకు అండగా వుంటానని,ఇంకా మున్ముందు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ యంపిపి తిరుమలనాధ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి, షేక్ ముస్తాఫ, వెంకన్న యాదవ్, అనుముల కోటేష్, గజ్జల శివానంద రెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి, ఇస్రం లింగస్వామి, నితిన్, తేరా అఖిల్ రెడ్డి, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, మహేష్, కోలాటం ఆడే మహిళలు గోగుల రేణుక, గోగుల దివ్య, గోగుల శైలజ, నర్రా నాగమణి, మీనాక్షి, రాజేశ్వరి, శివరాత్రి సాయిత, గోగుల మహాలక్ష్మి, కుంచం సైదమ్మ, కుంచం మంగ, గోగుల శాంతమ్మ, గోగుల సరిత, చిత్ర, గోగుల చందన, గోగుల కీర్తి, నర్రా లావణ్య, ఇందు, తదితర పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.