బాధితుడికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన మాడవిడి గంగాధర్ కు బాల్కొండ నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఇటీవల జరిగిన ప్రమాదంలో మాడవిడి గంగాధర్ కాలు విరిగింది. విషయం తెలుసుకున్న  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ శనివారం బాధితుడి ఇంటికి వెళ్లి  పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల కోరకు రూ.10వేల ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి నాయకులు, కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.