నవతెలంగాణ- భిక్కనూర్
భిక్కనూర్ పట్టణానికి చెందిన బచ్చగారి వెంకటి గుండె నొప్పితో బుధవారం రాత్రి మృతి చెందాడు. వెంకటి గత కొన్ని సంవత్సరాలుగా మండల కేంద్రం శివారులో ఉన్న స్టీల్ కంపెనీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న కంపెనీ మేనేజర్ అమిత్, అసిస్టెంట్ మేనేజర్ వడ్లూరి కిరణ్, కంపెనీ కాంట్రాక్టర్ గుండ్ల సిద్ధిరాములు 30 వేల రూపాయల నగదును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే వెంకటికి స్థానిక సింగిల్ విండో సొసైటీలో సభ్యత్వం ఉండడంతో సొసైటీ చైర్మన్ గంగల భూమయ్య అంత్యక్రియల నిమిత్తం 3 వేల రూపాయల నగదును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సొసైటీ ఉపాధ్యక్షులు రాజి రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మహిపాల్ రెడ్డి, నర్సింలు, మద్దూరి నర్సింలు, సాయిలు, మల్లేశం తదితరులు ఉన్నారు.