కార్మికుడి కుటుంబానికి ఆర్థికసాయం

నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని పిల్లిగుండ్ల విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ఆర్టిజన్‌ కార్మికునిగా పనిచేస్తున్న జగదీష్‌ గత కొంత కాలంగా అనారోగ్యానికి గురై ఐదు రోజుల క్రితం మతి చెందాడు. హెచ్‌ 82 సంఘం వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌ రెడ్డి సలహా మేరకు మంగళవారం ఆ సంఘం నాయకులు సుభాన్‌, మధుకర్‌, మహేందర్‌, యేసయ్య, పోచయ్య, స్వామిదాసు, పెంటయ్యలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 25 వేల ఆర్థికసాయం అందజేశారు. కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.