వర్షాలకు ఇల్లు కూలిన బాధితులకు ఆర్థిక సహాయం

Financial assistance to victims of house collapse due to rainsనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మెండోరా మండల కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు కూలి నిరశ్రయులైన పలువురు బాధితులకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన గోలి అమ్మాయి, చెన్న నర్సు, కంఠం దేవాయి ల ఇల్లు భారీ వర్షాలకు కూలిపోవడంతో ఉన్న గూడును కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు.ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తక్షణం ఆ ముగ్గురికి పదివేల చొప్పున ఆర్థిక సహాయాన్ని వారికి అందించాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు.ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితులు  ముగ్గురికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయం అందిస్తామని, నష్టాన్ని అంచనా వేసి నివేదించాలని సునీల్ కుమార్ ప్రభుత్వ అధికారులను కోరినట్లు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తెలిపారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.