నవతెలంగాణ -దండేపల్లి: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కోకిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం దండేపల్లి మండలంలో పర్యటించారు. ఇటీవలే వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. రంగంపల్లి గ్రామానికి చెందిన అల్లంల లచ్చన్న, పెద్ద పేట గ్రామానికి చెందిన రామనబోయిన లక్ష్మి, దొంతమల్ల హనుమంతుల, దండేపల్లికి చెందిన మాజీ ఎంపీపీ గుర్రం సత్తయ్యల కుటుంబాలను ఆయన పరామర్శించి వారి కుటుంబాలకు కొక్కిరాల రఘుపతిరావు టెస్టు ద్వారా కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ కార్యకర్త జంగం రాజనర్సు పక్షవాతం గారితో బాధపడుతుండగా ఆయనను పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు తాలపేటకు చెందిన సందుల శశాంక్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. రెబ్బెనపల్లి సర్పంచ్ కందుల కళ్యాణి అనారోగ్యానికి గురికాగా ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాబోయే ఎన్నికలకు కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు, అక్కల వెంకటేశ్వర్లు, కంది సతీష్, ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్, బొడ్డు కమలాకర్, వనపర్తి మాలిక, తోట మోహన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల దుర్గాప్రసాద్, మాజీ ఎంపీపీ అక్కల శకుంతల నాయకులు చీటీ సత్యం రావు, అల్లం సత్తన్న, లచ్చయ్య, సదానందం, రామయ్య, లింగారావు, జంగు, నిహాల్, బోలిశెట్టి లక్ష్మీనారాయణ, సత్తన్న, గోపాల్, మురళి, నెల్కి సుభాష్, రాయలింగు పాల్గొన్నారు.