
తమ చిన్ననాటి మిత్రుడి కుమార్తె ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగిందినీ తెలుసు కున్న తోటి మిత్రులందరు ఒక్కటై మిత్రునికి ఆదివారం ఇంటి వద్ద ఆర్థిక సహాయం అందించానారు. మండలంలోని పసర గ్రామంలో ఈనెల 10వ తారీఖున పాక శ్రీశైలం కుమార్తె అయిన పాక శ్రీజ 18స” డెంగ్యూ జ్వరంతో మరణించడం జరిగిందనీ తెలుసుకున్న 1996- 97 బ్యాచ్ తోటి బాల్య మిత్రులు గ్రామంలో ఉన్న మిత్రుని ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చినారు. తోటి మిత్రుడు కుమార్తె అనారోగ్యంతో మరణించడం వలన తమ మిత్రుడు కృంగిపోవడం ఎంతో బాధాకరమని తెలుసుకున్న తోటి మిత్రులు తమ వంతు సహాయంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్న మిత్రులు కలిసి ఎవరికీ తోచిన వారు.. ఒక్కటి గా ఆర్థిక సహాయం అంద చేయాలి అని..నిర్ణయించుకొని 42500 రూపాయలు పోగేసి ఆదివారం నాడు తమ తోటి మిత్రునికి అంద చేసినారు. ఇక ముందస్తుగా మా బాల్యమిత్ర లలో ఎవరికీ ఎలాంటి ఆపదలు కలిగిన మేమంతా ఒక్కటై మేమంతా ఒక్కటే అని మా బాల్య మిత్రులను అన్ని విధాల ఆదుకుంటామని ఆపదలో ఉన్న మ మిత్రులకు వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చినారు.
మిత్రుల ఔదార్యాన్ని ఆర్థిక సహాయాన్ని పలువురు అభినందించారు స్నేహానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.