కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం 

నవతెలంగాణ – పెద్దవంగర

మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మచ్చ యాకమ్మ (64) వృద్ధాప్యం తో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాదె యాకయ్య, ఈదురు సత్యనారాయణ, ఈదురు సైదులు, ఈదురు యాకయ్య, సోమయ్య, రాంపాక రాములు, శ్రీకాంత్,  వెంకన్న, జబ్బూరి యాకయ్య సంయుక్తంగా రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో ఈదురు యాకయ్య, కారుపాటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.