
ఆపత్కాలంలో బీమాతోనే కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని జగిత్యాల జిల్లా మెట్ పల్లి ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ తోట రాంబాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పని చేస్తున్న లబ్ధిదారు రామచందర్ కు రూ.2లక్షల75వేల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని నర్సాపూర్ తండాకు చెందిన గుగులోత్ స్రవంతి పేరుపైన ఆమె భర్త కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డు గుగులోత్ రామచందర్ 2023లో మెట్ పల్లి ఎస్బిఐ లైఫ్ లో రూ.5వేల సరల్ స్వధాన్ ప్లస్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో స్రవంతి మృతి చెందారు. ఆమె పేరు పై ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ కింద రూ.2లక్షల75వేల చెక్కు మంజూరైనట్లు ఆయన తెలిపారు.అట్టి చెక్కును పాలసీదారు భర్త, హోంగార్డు రామచందర్ కు అందించినట్లు వివరించారు. అకాల మరణం చెందిన స్రవంతికి కేవలం రూ.5వేలకే రూ.2లక్షల75వేల ఇన్సూరెన్స్ కవరేజి ఇచ్చినట్లు తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల వారికి సరల్ స్వధాన్ ప్లస్ ఇన్సూరెన్స్ అద్భుతమైన పాలసీ అన్నారు. ఈ పాలసీని 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు అని సూచించారు. ఆర్థికంగా అండగా నిలిచిన ఎస్బిఐ లైఫ్ వారికి రామచందర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఏజెన్సీ మేనేజర్ డాకురి హరీష్, లైఫ్ మిత్రలు మురళి, తిరుపతి, మధు, అరుణ్, ఊట్నూరి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.