
మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు చిన్నోళ్ల పోశెట్టి ప్రమాదవశాత్తు మరణించడంతో ఆయన కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా గురువారం పరామర్శించారు. మృతుడు పోశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు .పది వేల ఆర్థిక సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ నర్సింగ్ రావు, మాజీ సర్పంచ్ లు అల్లం రమేష్, రుతు కల్పన, మాజీ ఎంపిటిసి లావణ్య, గైని సతీష్, గంగాధర్, భూమయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.