న్యూఢిల్లీ: ఆర్ధిక సంవత్సరంలో మార్పులు చేయాలని కేంద్రం యోచిస్తోందని సమాచారం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం వెలుపడొచ్చని అంచనాలు వెలుపడుతున్నాయి. జనవరి ఒక్కటి నుంచి డిసెంబర్ ముగింపు వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతర దేశాల్లో ఇదే విధానం కొనసాగుతోంది. ప్రస్తుతం ఏప్రిల్ నుంచి మార్చి 31 వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణిస్తున్నారు. ఆర్ధిక సంవత్సరాన్ని మార్చితే కొత్త పన్ను తేదీలకు అనుగుణంగా పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు తమ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు పేర్కొంటున్నారు.