కోరుట్ల ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం

Fire accident at Korutla RTC depot– రాజధాని బస్సు దగ్ధం
నవతెలంగాణ – కోరుట్ల
జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ రాజధాని బస్సు పూర్తిగా దగ్ధం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన రాజధాని బస్సులో పెట్రోల్‌ పోస్తున్న సమయంలో బస్సు బ్యాటరీల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకుని వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీలలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆర్టీసీకి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది.