నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని బాదంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.4 లక్షల వరకు నష్టం వాటిలింది. ఆ గ్రామానికి చెందిన జాడీ సురేశ్ ఇంట్లో ఉన్న పూజ గదిలో దీపం మంటలు వ్యాపించడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో మండల ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మంటలను పూర్తిగా అర్పివేసి నట్లు ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. బాధితులు ఇంట్లో ఉన్న వంట సామాను, ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదు కూడా కాలిపోయిందని అధికారులు తెలిపారు. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వచ్చి ఉంటుందని స్థానిక తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఆఐ భానుచందర్ పంచనామా చేసి వివరాలు వెల్లడించారు. తమను ప్రభుత్వం, ఆదుకోవాలని బాధితుడు జాడి సురేష్ అధికారులను కోరారు.