టెక్స్‌టైల్స్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

నవతెలంగాణ-ధారూరు
మండల కేంద్రంలోని టెక్స్‌టైల్స్‌ కంపెనీ ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన సమయంలో కంపెనీలో పని చేసే సిబ్బంది కంపెనీ సెలవు ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజన్‌తో మంటలు ఆర్పారని తెలిపారు.