అగ్ని ప్రమాదాలు జరుగకుండా చూడాలి..

– రేంజ్ అధికారి రవి మోహన్ భట్…

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా చుడాలని రేంజ్ అధికారి రవి మోహన్ భట్ అన్నారు. సోమవారం ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం లో సెక్షన్, బిట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ ఎండాకాలం లో రాహదరి వేంట రాకపోకలు సాగించే సమయంలో కొందరు,బీడిలు, సిగరెట్లు తాగి అగ్గి అరకు ముందే పడేస్తుంది ఉంటారని, ఇంకొందరు బీడీ అకు కోసం కావాలనే అగ్గి పేడ్తరని అలాంటి వారిపై నిఘా పెట్టాలని, ఎక్కడైన ప్రమాద వశాత్తు అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న రేంజ్ కార్యాలయం లో అందుబాటులో ఉన్న ఫైర్ బ్లోవర్ తో మంటలను ఆర్పలని సూచించారు. అటవీ భూములు కబ్జా కాకుండా చుడాలని పేర్కొన్నారు.ఈ సమావేశం లో డిప్యూటీ రేంజ్ అధికారులు శ్రీనివాస్, అసిఫోద్దిన్, సెక్షన్ అధికారులు బాపురావు, సుబ్బారావు, సురేందర్, ఆనంద్,అతిఖ్ తో పాటు బిట్ అదికారులు తదితరులు పాల్గొన్నారు.