అమరేశ్వర ఆలయంలో మంటలు

Fire at Amareswara Temple– భూపాలపల్లి జిల్లాలో ఘటన
నవతెలంగాణ మహదేవపూర్‌
జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని పురాతన అమరేశ్వర ఆలయంలో గురువారం రాత్రి ఆంజనేయస్వామి విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటన చోటుచేసుకుంది. దాంతో గ్రామస్తులు అప్రమత్తమై మంటలు ఆర్పారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కావాలని చేశారా? లేదా? ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపడుతున్నారు.