నగరంలోని బ్రహ్మపురి బడా రాంమందిర్ గోశాలలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆలయం సమీపంలో ఆవుల కోసం నిల్వ ఉంచిన గడ్డివాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో గడ్డి పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్న ఆవులకు ఎలాంటి ప్రమాదం కలగకపోవడం ఊరటనిచ్చింది. సమీపంలోని కాలనీవాసులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆపై ఫైర్జేషన్కు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.