నీలోఫర్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

నీలోఫర్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం– షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే.. : సూపరింటెండెంట్‌
నవతెలంగాణ-మెహిదీపట్నం
హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రి లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో ఒక్కసారిగా మంటలు చెల రేగాయి. దాంతో పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ఆస్పత్రిలోని రోగులు, పిల్లలు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆస్పత్రి ఆవరణకు చేరుకుని మంటలు ఆర్పింది. ఈ ఘటనపై నీలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషారాణి స్పందించారు. నీలోఫర్‌ పాత భవనంలోని మైక్రోబయాలజీ ల్యాబ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల చిన్నపాటి అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు. సిబ్బంది ఫైర్‌ సేఫ్టీపై శిక్షణ పొంది ఉన్నందున వేగంగా స్పందించి చర్యలు చేపట్టారన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.