యూపీలో అగ్నిప్రమాదం..

యూపీలో అగ్నిప్రమాదం..
Kaushambi: Firefighters try to douse a fire broken our at a fire cracker factory following an explosion, in Kaushambi district, Sunday, Feb. 25, 2024. (PTI Photo)(PTI02_25_2024_000271B)

– నలుగురు మృతి
రారుబరేలి : ఉత్తరప్రదేశ్‌ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబి జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడుసంభవించింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.