కోకాపేట్‌లో అగ్నిగుండాలు, నాగవెల్లి ఒగ్గు కథలు

– 2వ రోజు మల్లన్న జాతర ఉత్సవాలు
నవతెలంగాణ-గండిపేట్‌
కోకాపేట్‌ గ్రామంలో శ్రీ మల్లన్న జాతర ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అగ్ని గుండాలు నాగవల్లి కళ్యాణం ఒగ్గు కథల కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు యాదవ సంఘం నిర్వాహకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర ఉత్సవాలను నిర్వహించారు. అగ్నిగుండాలు తొక్కడం, మహిళలు ఊరేగింపు రావడంతో పాటు యాదవ సంఘం తరఫున కుటుంబ సభ్యులందరూ ఒడిబియ్యం వండిపెట్టి ఆలయం వద్ద సమర్పించుకున్నారు. ఒగ్గు కళాకారులచే నిర్వహించిన మల్లన్న చరిత్ర ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానం ఏర్పాట్లు చేశారు. గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా స్వామివారు తోడు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యాదవ సంఘం నిర్వాహకులు ఆంజనేయులు యాదవ్‌ బిక్షపతి యాదవ్‌ ఆర్కే రాము యాదవ్‌, గ్రామస్తులు మహిళలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.