చేపూరు గ్రామ శివారులో పెద్ద వృక్షానికి నిప్పు

A big tree caught fire in the suburbs of Chikvur villageనవతెలంగాణ – ఆర్మూర్

మండలంలోని చేపూర్ గ్రామ శివారులో రహదారికి ఆనుకొని ఉన్న పెద్ద వృక్షానికి  మంగళవారం రాత్రి  ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. అగ్గి తగలడంతో వైపు నుండి వెళ్తున్న వాహనదారులు ఆ చెట్టును చూసి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఫైర్ ఇంజన్ సహాయంతో ఆ నిప్పును ఆర్పి వేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ మధుసూదన్ రెడ్డి, డిఓపి మారుతి, ఫైర్ మాన్ అనిల్, నరేష్  తదితరులు పాల్గొన్నారు.