స్వీడన్‌ స్కూల్లో కాల్పులు

Sweden school shooting– పదిమంది మృతి.. పలువురికి గాయాలు
స్టాకహేోమ్‌ : సెంట్రల్‌ స్వీడన్‌లోని ఒరెబ్రొ నగరంలో మంగళవారం ఒక స్కూల్లో జరిగిన కాల్పుల్లో పదిమంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. సంఘటనా స్థలంలో అంబులెన్సులు, అత్యవసర వాహనాలు చేరుకున్నాయి. అయితే ఎంతమంది గాయపడ్డారో కచ్చితంగా తెలియడం లేదని, పెద్ద ఎత్తున ఆపరేషన్‌ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి వున్న సమాచారం ప్రకారం పదిమంది మృతిచెందారని అధికారవర్గాలు తెలిపాయి. ‘హత్యకు ప్రయత్నించడం, లూటీలు, అల్లర్లు, గృహ దహనాలు, ఆయుధ నేరాల’ కింద ఈ నేరాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సమీప ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్ధులను బయటకు పంపకుండా లోపల వుంచి తాళాలు వేసినట్టు చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన వార్తలు చూసినట్లైతే చాలా సీరియస్‌గా కనిపిస్తోందని న్యాయశాఖ మంత్రి గున్నార్‌ స్టార్మర్‌ చెప్పారు. అయితే ఆటోమేటిక్‌ తుపాకీతో జరిపిన కాల్పులుగా తాము భావిస్తున్నామని పలు మీడియా, సాక్షుల కథనాలు పేర్కొన్నాయి.