
పెద్దవూర మండలంలో 26 గ్రామ పంచాయతీలలో మంగళవారం కొత్తలూరు, శిరసనగండ్ల,బసిరెడ్డి పల్లి, బట్టుగూడెం,జయరాం తండా, పాల్తీ తండా, పర్వేదుల పంచాయతీ లలో గ్రామసభలు నిర్వహించారు.మండలంలో అధికారులను 4 టీంలు తో గ్రామసభలు నిర్వహించనున్నారు.ఈ గ్రామ సభలను పెద్దవూర ఎస్ఐ వీరబాబు పరిశీలించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి గొడవలు జరుగకుండా అధికారులకు సహకరించాలని కోరారు. ఈ గ్రామ సభలో లో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పథకాలపై గ్రామ సభ ల లో చర్చ జరుగుతుందని, లబ్ధిదారులనుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీలపావని,ఎంపీడీఓ సుధీర్ కుమార్, ఆర్ డబ్ల్యూ ఏఈ దీక్షిత్ కుమార్, సూపరిండెంట్ హఫీజ్ ఖాన్, ఏఓ సందీప్ కుమార్, ఏఎంఆర్పీ ఏఈఈ మల్లయ్య, కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డీ, పంకజ్ రెడ్డీ,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.