
ఉగాది తర్వాత వచ్చే పండుగలలో మొదటి పండగ అయిన తొలి ఏకాదశి వేడుకలను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోషి మాత దేవాలయంలో ఘనంగా నిర్వహించార.బుధవారం దేవాలయ అర్చకులు వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి పంచామృతములతో అభిషేకం నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి తమ అస్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా సామూహికంగా శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు సోమ శ్రీశైలం దేవర్శెట్టి సోమయ్య యామా వెంకటేశ్వర్లు బ్రాహ్మణపల్లి దేవి దత్తు, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, కనక రత్నం జగదీశ్వరి దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.