కాశ్మీర్‌లో తొలి ఎలక్ట్రిక్‌ రైలు

కాశ్మీర్‌లో తొలి ఎలక్ట్రిక్‌ రైలుకాశ్మీర్‌: కాశ్మీర్‌లో తొలి ఎలక్ట్రిక్‌ రైలు మంగళవారం పరుగులు తీసింది. ప్రధాని మోడీ పచ్చజెండా ఊపారు. దాంతో పాటు దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగాన్ని ప్రారంభించారు. దాంతో రైల్వే కాశ్మీర్‌ వెళ్లాలనే కల త్వరలోనే సాకారం కాబోతున్నది. శ్రీనగర్‌ నుంచి సంగల్దాన్‌, సంగల్దాన్‌ నుంచి శ్రీనగర్‌ వరకు రైల్వేశాఖ ఎలక్ట్రిక్‌ లైన్‌ నిర్మించింది. ఇది కాశ్మీర్‌లోనే తొలి ఎలక్ట్రిక్‌ రైలు కావడం విశేషం. రైలు ప్రారంభంతో లోయలో సామాజిక, ఆర్థిక వృద్ధి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.