అమ్మాయిలకు తొలి పరీక్ష

First exam for girls– నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ ఢ
– ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌
దుబాయ్ (యుఏఈ): ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా తొలి పరీక్షకు సిద్ధమైంది. గ్రూప్‌-ఏలో భాగంగా నేడు న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు తలపడనుంది. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ సొంతం చేసుకోవాలనే తపనతో యుఏఈలో అడుగుపెట్టిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన.. నేడు కివీస్‌తో మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ దుబారు వేదికగా జరుగనుండగా.. రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. నేడు మరో మ్యాచ్‌లో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా ఢకొీట్టనున్నాయి. ఆదివారం ప్రియ ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ముంగిట.. తొలి పరీక్షలో న్యూజిలాండ్‌పై మెరుపు విజయం సాధించేందుకు అమ్మాయిలు సిద్ధమవుతున్నారు.
జోరు చూపిస్తారా? : టీమ్‌ ఇండియా అమ్మాయిలు జోరు మీదున్నారు. ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచుల్లో సాధికారిక విజయాలు నమోదు చేశారు. వెస్టిండీస్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందిన అమ్మాయిలు.. దక్షణాఫ్రికాను 28 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మరోవైపు న్యూజిలాండ్‌ అమ్మాయిలు వార్మప్‌లో ఓ మ్యాచ్‌లో ఓటమి పాలై.. మరో మ్యాచ్‌లో విజయం సాధించారు. భారత జట్టులో ఆల్‌రౌండర్‌ శ్రేయాంక పాటిల్‌, వికెట్‌ కీపర్‌ యస్టికా భాటియా ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉన్నాయి. ప్రాక్టీస్‌ మ్యాచుల్లో రాణించినా.. నేడు తుది జట్టులో నిలిచేది అనుమానమే. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో ముందుగా రానుంది. నం.3 స్థానంలో క్రీజులోకి రానున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్కోరు వేగం పెంచే ప్రణాళికలో ధనాధన్‌ మోత మోగించే అవకాశం కనిపిస్తుంది. స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ సహా జెమీమా రొడ్రిగస్‌, రిచా ఘోష్‌లు భారత్‌కు కీలకం కానున్నారు. న్యూజిలాండ్‌ జట్టులో స్టార్స్‌కు కొదవ లేదు. సోఫీ డివైన్‌ సహా సుజీ బేట్స్‌, మ్యాడీ గ్రీన్ల, అమేలీ ఖేర్‌లకు భారత్‌పై మంచి రికార్డుంది. మంచు ప్రభావం కనిపించే దుబారులో ఇరు జట్ల స్పిన్నర్లు మ్యాచ్‌ ఫలితాన్ని శాసించే అవకాశం కనిపిస్తుంది.