ఎంఎస్‌ఎంఇలకు ఫస్ట్‌ ఇండియా వర్క్‌షాప్‌

హైదరాబాద్‌ : నగరంలోని ఎంఎస్‌ఎంఇల పరివర్తనకు మద్దతును అందిస్తున్నట్లు ఫస్ట్‌ ఇండియా పేర్కొంది. ఈ రంగంలో డిజిటల్‌ మార్పులను కల్పించడానికి ఫోరమ్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ రిటైలర్స్‌, సెల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ (ఫస్ట్‌ ఇండియా) ”ఫ్యూచర్‌ ప్రూఫింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌” అనే డిజిటలైజేషన్‌ వర్క్‌షాప్‌ను నిర్వహించినట్లు తెలిపింది. దీంతో చిన్న వ్యాపారాలకు సహాయపడే అవకాశాలపై అవగాహన కల్పించడం, మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. దీనితో వారు డిజిటల్‌గా మారి, స్వయం సమృద్థితో వ్యాపార నిర్వహణను కొనసాగించుకునేందుకు అవకాశాలు మెరుగవుతాయని తెలిపింది. ఎంఎస్‌ఎంఇలలో డిజిటలైజేషన్‌కు మద్దతునిచ్చి.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం సహకారాన్ని పెంచడం, దాని ప్రస్తుత వాటాను అధిగమించడమే తమ లక్ష్యమని ఫస్ట్‌ ఇండియా ట్రస్టీ అధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు.